Yamaleela


Yamaleela :

యమలీల .--అంటే ..ఒక కమెడియన్ తో కృష్ణా రెడ్డి చేసిన ప్రయోగం ....చిన్న ,మధ్యతరగతి సినిమాలకి పేరు తెచ్చుకున్న కృష్ణా రెడ్డి తీసుకున్న వియూత్న నిర్ణయం ...అది సక్సస్ అయ్యింది ...అందరికీ పెరుతెచ్చింది .... స్క్రిప్ట్ గురించి చూద్దాము...ఓకే ..

Script Points :-

1. Main Character’s struggle  /Sentiment /conflicts leads to story move forward .
సినిమా కధ లో అలీ కి అమ్మ అంటే చాల ఇష్టం ...అమ్మ ఒకప్పుడు మహారాణి గా వెలిగింది .కానీ ఇప్పుడు పేదరికం లో వుంది ..ఆలీ అమాయకుడు ,మంచివాడు కానీ శక్తి హీనుడు ...వీళ్ళిద్దరి  సెంట్ మెంట్ సినిమాకు ప్రాణం ..ముఖ్యం గా మెయిన్ హీరో ఫీల్ అయ్యే సెంటిమెంట్ సినిమాకు ప్రాణం ..దానిమీదే కధ నడవాలి ...అలాగే కధ నడుపుతారు  ..
మెయిన్ క్యారెక్టర్ కధలో పెయిన్ వుండాలి ...అది ఉంటేనే సినిమా పండుతుంది ...ముఖ్యం గా ఇది సోషియో ఫాంటసీ కాబట్టి ...ఎందుకంటే మెయిన్ క్యారెక్టర్ కి పెయిన్ వుంది కాబట్టి .. పెయిన్ తగ్గించే పని సోషియో ఫాంటసీ తీరుస్తుంది ...అక్కడి నుండి మెయిన్ క్యారెక్టర్ సెంటిమెంట్ మీద ఆడుకుంటే కధ నడుస్తూ కాదు ..పరిగెడుతూ వెళ్తుంది ....
యమలీల లో కుడా ఎప్పుడయితే భవిష్య వాణి బుక్ ఆలీ కి దొరికిందో ..ఆలీ కి అన్నీ సమకూరుతాయి ...అంటే  కధ లో ముందు చూపిన పెయిన్ ని తగ్గిస్తారు ...కొత్త పెయిన్ కి దారి మళ్ళిస్తారు  ...అమ్మ కోరిన విధం గా మహల్ లోకి తీసుకు వెళ్తాడు ...కానీ "అమ్మ మరణం " అనే సరికి కధ లో కీలక మలుపు వస్తుంది ...అక్కడ ఇంటర్వెల్ వేసారు ... ఆలీ అమ్మను కాపాడుకోవడానికి ఎన్ని తిప్పలు పడ్డాడు అనేది సెకండ్ హాఫ్ కధ ..

2. Formula of Socio Fantasy:

సోషియో ఫాంటసీ కధ తీసుకున్నా మెయిన్ క్యారెక్టర్ కి పెయిన్ పెట్టాల్సిందే ...అవతార్ లో హీరో కి కాళ్ళు సరిగ్గా వుండవు ...
జగదేక వీరుడు అతిలోక సుందరి --లో హీరో చిరంజీవి తను పెంచే అనాధ బాలిక కళ్ళు బాగుచేయడం అనేది పెయిన్ ...
ఈగ --తను ప్రేమించిన అమ్మాయి " లవ్ యు " చెప్పేసమయం లో  నాని సుదీప్ చేతిలో చనిపోవడం పెయిన్ ...అలా పెయిన్ ఉంటేనే సోషియో ఫాంటసీ లోకి వెళ్లి ..హీరో అనుకున్నది సాధిస్తాడు ...అక్కడి నుండి ఇంకో కాన్ఫ్లిక్ట్  తో సినిమా రన్ చేస్తారు ....

3. Comic villain character : తోట రాముడు

సినిమా లో "తోట రాముడు " కీలకం అతనే విలన్ క్యారెక్టర్ ..సినిమా కధ ను బట్టి విలన్ వుండాలి ..ఇది కమెడియన్ సినిమా కాబట్టి  "కామెడీ చేసే విలన్ " అవసరం ...అలా తోటరాముడు  క్యారెక్టర్ వలెనే ఆలీ  వర్షం లో తడుస్తాడు ..తర్వాతే భవిష్యవాణి దొరుకుతుంది ...మళ్ళీ అలీ వెళ్లి "ఒక లక్ష రూపాయలు ఇచ్చి టీ తాగమనేసరికి ..తోట రాముడి కి డౌట్ వస్తుంది ...అదే ప్రీ క్లైమాక్స్ కి తీసుకెళ్తుంది ... క్యారెక్టర్ వలెనే సినిమా లో కామెడీ ఫైట్ లు వస్తాయి ...

4.Supporting Character : యముడు క్యారెక్టర్

యమలీల లో యముడు క్యారెక్టర్ చాల ముఖ్యం ..ఎందుకంటే సమస్య చిత్ర గుప్తుడు  వల్ల వచ్చింది ..భవిష్యవాణి ని బులోకం లోకి రావడానికి కారణం అతడే ..కానీ ముందు యముడ్నే నిలదీస్తారు కాబట్టి ...యముడు కి లక్ష్యం "భవిష్యవాణి " ని తీసుకెళ్లడం ...అలా వచ్చిన యముడి ,చిత్ర గుప్తుడి పాట్లు ...హిమ క్రిములకు ఆకర్షణ ..కోటా శ్రీనువాసరావు  తో  కామెడీ అన్నీ కొత్తగా వుంటాయి ..ఫైట్ లుకుడా కొత్తగా వుంటాయి ...

5.Drive -1: సెకండ్ హాఫ్ లో ఒక సీన్ వుంటుంది ..ఒక వ్యక్తి కత్తులతో యముడి ముందు పడి 
పోతాడు ..అప్పుడు యముడు "భవిష్య వాణి దొరికేంతవరకు ఏమి చేయలేము " అని అంటాడు ..అది విన్న ఆలి ..యముడి ని ఒక లేడీ ఆర్టిస్ట్ చేత హౌస్ అరెస్ట్ ప్లాన్ వేస్తాడు ...కొంతవరకు ప్లే వర్క్ అవుట్ అవుతుంది  ..కానీ యముడి కి తెల్సి పోతుంది ...అలా భవిష్యవాణి జాడ యముడి కి తెలియడం ...భవిష్యవాణి చేతులు మారుకుంటూ వెళ్ళడం  బాగుంటుంది ....

6. Special Attractions :

ఇలాంటి సినిమా కి కొత్తదనం ఉండేలా చూసుకోవాలి ...
1.సూపర్ స్టార్ కృష్ణ సాంగ్
2.యముడి సాంగ్స్ ..ఫైట్ లు ...
3.క్లైమాక్స్ లో తోట రాముడు --యముడు చేసే పాటల యుద్ధం ..
4.అమ్మ సెంటిమెంట్ --సాంగ్ ...
5.తోట రాముడు అంటే విలన్ కి హీరోయిన్ కి మధ్య పోటా పోటీ ఫైట్ లు ...
6.బ్రహ్మానందం చిత్రగుప్తుడి గెటప్  లో కామెడీ డౌట్స్ ..

7.Creative clue : అనుకోకుండా అలా "భవిష్యవాణి " బుక్ దొరికితే ఎలా వుంటుంది అనేది కధ.. లైన్ కి అన్నీ క్యారెక్టర్ లు వేసి కధ అల్లుకుంటారు ...
అనుకోకుండా "పండోరా గ్రహం " వెళితే ఏమిటి కధ ?...అదే అవతార్ ..

ఇలా ఊహల్లో జరిగే వాటిని ..నిజం చేస్తూ రాసుకునే కధలు అద్భుతం గా ఆడతాయి ...ఎందుకంటే "ఇది రొటీన్ కధ లా వుండదు ..స్టొరీ ,సీన్ ,క్యారెక్టర్ లు అన్నీ కొత్తవి వచ్చేస్తాయి ...ఇక సరిఅయిన స్ట్రక్చర్..మలుపులు ..డ్రైవ్ లు పెట్టుకోవడమే మిగిలివుంటుంది ...ఓకే ..గో ఎహెడ్ ....

0 comments:

Post a Comment