PelliPusthakam



Pelli pusthakam :

పద్మశ్రీ బిరుదు పొందిన వారు ...అమ్మాయి అంటే బాపు బొమ్మ అని పోగిదిన్చుకున్న వారు ...5 నంది అవార్డు లు అందుకున్న సినిమా లు ...3 సార్లు  ఫిలిం ఫేర్ అవార్డు లు పొందిన వారు మన బాపు గారు ...తీసింది 51 సినిమాలు ...అయన సినిమా లోంచి ఎన్నో నేర్చుకోవచ్చు ..
స్టొరీ లైన్ త్వరగా చెప్పడం ..ప్లాట్ లోకి త్వరగా వెళ్ళడం ...కొత్త క్యారెక్టర్ లు ..వాళ్ళు మాటలు పలికే డిక్షన్ ...చెప్పే విధానం ..సున్నిత మైన నటన ...షాట్ డివిజన్ ...ఫ్రేమ్ వర్క్ లు ....లో బడ్జెట్ లో సినిమా తీయగల నేర్పు ..ఇవన్నీ తెలుస్తాయి ...
వారు తీసిన ..నేను చాలా సార్లు చూసిన సినిమా "పెళ్లి పుస్తకం " స్క్రిప్ట్ పాయింట్స్ చూద్దాము

1.Story line :

పెళ్లి అయిన ఇద్దరు ..పరిస్థితుల కారణం గా పెళ్లి కానట్టు నటిస్తూ ఒకే ఆఫీసు లో పని చేయాలి ...ఎందుకు చేయాల్సి వచ్చింది ? అలా చేయడం వలన వాళ్ళు పడిన ఇబ్బందులేమిటి ? వాటినుండి ఇద్దరు ఎలా బయట పడ్డారు ? అనేది కధ ..
పాత మిస్సమ్మ లో కుడా పెళ్ళికాని వారు పెళ్లి అయినట్టు నటించాలి ...ఇందులో కొంచెం మార్చారు ...ఇదే చాలా సినిమాల్లో ప్లే చేసారు ..అల్లుడుగారు ..
పెట్టుడు భార్య ,పెట్టుడు భర్త .. కోవకు చెందినవే ..."శత్రువు " లో సాంగ్ లో ప్లే చేసారు ...
స్టొరీ లైన్ బాగుంటే కధ కొత్తగా అవడానికి ఆస్కారం వుంటుంది ...ఇక్కడే ఆడా -మగా తేడా లు ..పెళ్లి అయ్యాక ఆలోచన ధోరణి ..అపార్ధాలు ..అలకలు ...ఇలా సంసారం లో ఇద్దరి మధ్య చూపారు ..అందుకే ఇది ఫామిలీ ఎంటర్టైనర్ ...

2.Conflict :

ఒకే ఆఫీసు లో చేరడానికి పరిస్థితులు కల్పించారు ..ఇద్దరు ఏవో డ్రామా లు ఆడారు ..అన్నీ వర్క్ అవుట్ అయ్యాయి ...ఇక్కడనుండే కధ లో కాన్ఫ్లిక్ట్ వస్తుంది ..అదీ గుమ్మడి కూతురు రావడం తో ...దివ్యవాణి  --రాజేంద్ర ప్రసాద్ ని అనుమానించడం మెల్లగా మొదలవుతుంది .సుభలేఖ సుధాకర్ పనులతో రాజేంద్ర ప్రసాద్ కి కోపం వస్తుంటుంది ..మధ్య మధ్య లో రాజేంద్ర ప్రసాద్ చేసే పనులు వీళ్ళ డ్రామా కి ఫుల్ స్టాప్ పెడతాయో అనే టెన్షన్ కల్గిస్తుంది .. చీర విషయం లో కాన్ఫ్లిక్ట్ వస్తుంది ...వనభోజనం సాంగ్ వలన దివ్యవాణి --గుమ్మడి కూతురికి నాట్యం నేర్పాలి ..అది శుభలేక సుధాకర్ ప్లాన్ ...ఇలా ఇద్దరూ తమ సంసారానికి దూరం అవుతూ ..అపార్ధాలతో సినిమా నడుస్తూ అవి తారాస్థాయికి చేరుతాయి ...చివరిలో దివ్యవాణి కి వున్న సమస్యను తీర్చి ..మార్చడం ..వీళ్ళిద్దరూ ఆడే డ్రామా కి తెరపడటం జరుగుతుంది ...
కధ ప్రశాంతం గా స్టార్ట్ అయి ...మధ్యలో సంక్షుబితం గా మారి ..చివరిలో సుఖాంతం అవ్వాలి ..ఇది కధ లక్షణం ...
అంటే ప్రశాంతం గా వున్న కొలను లో రాళ్ళూ వేస్తూ వుంటే అలలు వస్తుంటాయి ...అవి పెరిగి పెరిగి ..చివరిగా ఆగిపోతాయి ...అటువంటిదే కధ ..దానికి సంభందించిన స్క్రిప్ట్ ...ఇది సరిగ్గా వుంది ..కొన్ని క్యారెక్టర్ మధ్యే నడిచింది ..ఆహ్లాదం గా వుంది ...ఇది ముళ్ళపూడి వారు అందించిన స్క్రిప్ట్ ...అది ఇంకో 100 ఏళ్ళ తర్వాత చూసినా బాగానే వుంటుంది ...

3. Characters:

హీరో /హీరోయిన్ ఇద్దరికీ ఒకటే లక్ష్యం అయినప్పుడు ..స్క్రిప్ట్ లో ఇద్దరూ ఇబ్బంది పడాలి ...అలా ఇబ్బంది పెట్టే క్యారెక్టర్ లు వీరి చుట్టూ అల్లాలి ...అలా అల్లినవే
రాజేంద్ర ప్రసాద్ కి --గుమ్మడి కూతురు
దివ్యవాణి కి ---సుభాలేక సుధాకర్  క్యారెక్టర్ లు ...ఎలాగు పెద్దలు వున్నారు గుమ్మడి ,అతని భార్య .. వీల్ల వలన  సినిమా మలుపులకు గురి అవుతుంది ..
గుమ్మడి అసిస్టెంట్ గా చేసిన రావికొండలరావు గారి పాత్ర --రాజేంద్రప్రసాద్ ని ..దివ్య వాని ని ఒక కంట కనిపెట్టే పాత్ర ...అనుమానాలు రేకెత్తించే పాత్ర ...
దివ్య వాని బావ పాత్ర --మాటలు ఎక్కువ వుండవు ..కానీ కదః కు అవసరం ..
ఇలా ప్రతీ పాత్రా సినిమా కు ఎంత అవసరమో అంతే రాస్తారు .. తీస్తారు ...కాబట్టే వారి సినిమాలు కళా ఖండాలు ...కలా కండలు ...

4.Characterization :
ప్రతీ పాత్ర కి ఒక మాట ..మాట్లాడే పద్ధతి ..అసలు మాటలు లేక పోవడం ..ఒక డ్రెస్సింగ్ ..ఒక హాబీ ఇలా పెడతారు ..దాని వలెనే మన దగ్గరి ఇళ్ళలో తెల్సిన కధ లా వుంటుంది సినిమా ...అక్కడే కిటుకు వుంది ..క్యారెక్టర్ లు సరిగ్గా డిజైన్ చేయడం ...
గుమ్మడి --"నేను " అనే మాట తో చెప్పడం మొదలెడతారు ..పెద్దమనిషి లా ..
రావికొండలరావు --సైగలతో మాటలాడుతూ ఉంటాడు ..
సుభాలేక సుధాకర్ --కళ్ళ తో విలన్ చూపులు చూస్తుంటాడు ..
ఇక హీరో /హీరోయిన్ లు సరే సరి ...ఇలా ప్రతీ క్యారెక్టర్ "ఒక పద్దతిగా " ప్రవర్తిస్తుంది ..అందుకే బాగుంటుంది ...
కధ కు అవసరం అనుకున్న క్యారెక్టర్ లు కొన్నే వుంటే  కధ బాగుంటుంది ...క్యారెక్టర్ లు ఎక్కువయిన కొద్దీ గజి బిజీ గా వుంటుంది స్క్రిప్ట్ ..

5.Shot Division :
ప్రతీ సీన్ ని జాగర్త గా గమనించండి ...అందులో షాట్ డివిజన్ మీకు అర్ధం అవుతుంది ..డైరెక్టర్ ఆంటే తీసే సీన్ ని విజుఅల్ చేసుకుని ..దాన్ని అర్ధవంత మయిన తక్కువ షాట్ లలో ..నటుల మంచి నటనను రాబట్టి  అవుట్ పుట్ తెప్పించుకునేవాడు ...బాపు గారు స్వయానా  పెయింటర్ కాబట్టి  ప్రతీ ఫ్రేమ్ చేక్కినట్టే  వుంటుంది ...ఒక 10 సినిమాలు బాపు గారివి 6 నెలలు చుస్తే మీకు షాట్ డివిజన్ ,డైరెక్టర్  లక్షణాలు తప్పకుండా వచ్చేస్తాయి ..

మరిన్ని విషయాలు ఇందులో వున్నాయి చదవండి ..

0 comments:

Post a Comment