Kushi



Khushi :

1. Attraction

When two magnets or magnetic objects are close to each other, there is a force that attracts the poles together.

Repulsion

When two magnetic objects have like poles facing each other, the magnetic force pushes them apart.

మనమందరం Magnetism  చాప్టర్ బాగానే చదువుకున్నాము కదా... అందులో రెండు బేసిక్ రూల్స్ వున్నాయి ..ఒకటి ఆకర్షణ ..రెండు వికర్షణ ... రెండు బేస్ చేసుకుని చాలా సినిమాలు రాయవచ్చు ..తీయవచ్చు ...

అమ్మాయి ...అబ్బాయి ... సౌత్ పోల్ ..నార్త్ పోల్ లాంటివారు ...

ఇందులో అమ్మాయి , అబ్బాయి ఇద్దరూ వ్యతిరేక మనస్తత్వం అయితే కధలు చాలా బాగుంటాయి ..వీళ్ళిద్దరూ ఆకర్షించుకుంటారు ...

అమ్మాయి ,అబ్బాయి ఒకే టైపు మనస్తత్వం అయితే ..వికర్శించుకుంటారు ..అప్పుడు అది "ఖుషి " అవుతుంది ...రెండు ఇగో వున్నా పొట్టేళ్ళు కొట్టుకున్నట్టు వుంటుంది ...అది కుడా ప్రేమగా ...అందుకే సినిమా  అంతలా ప్రతీ అమ్మాయికి ,ప్రతీ అబ్బాయికి పట్టేసింది ..2001 లో ఒక ఊపు ఊపేసింది ...

1.Starting with universal theme voice over :
సినిమా కధ స్టార్ట్ చేస్తూనే ..ఎండింగ్ ఏమిటో చెప్పేస్తాడు ..."మధుమతి కి ,సిద్ధూ కి దేవుడు రాసి పెట్టి వున్నాడు "అని చెప్పడం వలన ...ఎలా వాళ్ళిద్దరూ కలుస్తారు అనే  పాయింట్ తో సినిమా ని చూడటం స్టార్ట్ చేస్తాము ...(బొమ్మరిల్లు కుడా ఇలాగే స్టార్ట్ అవుతుంది )...అంటే సినిమా లైన్ ని ప్రేక్షకుడికి ఇంజక్షన్ చేసినట్టు త్వరగా చేయాలి ...అది లేట్ అవుతున్న కొద్దీ  సినిమా కధ ఏమిటో అర్ధం గాక ప్రేక్షకుడు గందరగోళం లో పడతాడు
... ఇలాంటివి ముందు చెప్పగానే అందరూ కనెక్ట్ అవుతారు ...

2. Thread (inner and outer ): Inner (Intra-Personal): Ego conflict.
ఒక వ్యక్తిత్వం ఉన్న   అబ్బాయి తనంతట తానుగా " లవ్ యు " అని ఒక అమ్మాయికి చెప్పలేడు..వీడికి మేల్ ఇగో అడ్డువస్తుంది ...అలాగే అమ్మయికుడా వ్యక్తిత్వం తో వున్నది అయితే ,తను కుడా తనంతట తానుగా " లవ్ యు"అని ఒక అబ్బాయికి  చెప్పలేదు...ఇలాంటి ఇగో ఉన్న ఇద్దరి ప్రేమికుల కధ ...ఇదే సినిమా లో వుండే ఇన్నర్ థ్రెడ్ ....
వీళ్ళిద్దరూ కలవడానికి ..తిరగడానికి ..ఇంకొక థ్రెడ్ వుంది ..అదే బాబు-శాంతి లవ్ ...(శివాజీ లవ్ మాటర్ )...ఇది బయటకు కనిపించే థ్రెడ్ ... థ్రెడ్ మీద బేస్ అయ్యి సినిమా నడుస్తుంది ...దీని మూలం గా నే సీన్ లు జరుగుతాయి ...

కధ లో ఇన్నర్ ఇగో కాన్ఫ్లిక్ట్ వలనే సినిమా అంతా నడుస్తుంది .. కాన్ఫ్లిక్ట్  ఫస్ట్ హాఫ్ నుండి మెల్లగా స్టార్ట్ అయి ..సీన్ నుండి సీన్ కు  పెరుగుతూ  ఇంటర్వెల్ కి చేరి విడిపోవడానికి దారి తీస్తుంది ...మళ్ళీ మెయిన్ థ్రెడ్ వలన మళ్ళీ కలుస్తారు ..ఇగో కాన్ఫ్లిక్ట్  కొత్త క్యారెక్టర్ వలన పెరుగుతూ వుంటుంది ...అది పూర్తిగా విడిపోయే వరకు వెళ్తుంది ...కానీ చివర్లో కలుస్తారు ...అందుకే సినిమా హిట్ అయ్యింది ...క్యారెక్టర్ గ్రాఫ్ పెరిగినా ..వాళ్ళకున్న ప్రొబ్లెమ్స్ గ్రాఫ్ పెరిగినా సినిమా లో ప్రేక్షకుడు బాగా ఇన్వాల్వ్ అవుతాడు .. ప్రాబ్లం తీరిపోగానే టెన్షన్ నుండి ఫ్రీ అవుతాడు ...ఇది సినిమా కధ లో ప్లే చేసినా అది హిట్ అయి తీరుతుంది ...

3.What Does the Supporting Character Do?

Reveals Facets of the Hero:  Bring out the different facets of the hero's character.
Comic Relief:  Lighten up the story and release audience tension. 
ఖుషి లో అలీ క్యారెక్టర్ ,సుధాకర్ క్యారెక్టర్ ,వలన కధ కామెడీ పరం గా తయారుయ్యింది ..సినిమాకి కీలకమయిన టైం లో అలీ  వస్తాడు ...సెకండ్ హాఫ్ లో వచ్చే లేడీ క్యారెక్టర్  వలన భూమిక బాధ పడుతూ సాంగ్ (గజ్జె ఘల్లుమన్నాది రో ) వేయడం అమ్మాయిల మనస్తత్వానికి అద్దం పట్టినట్టు వుంది ...
విలన్ క్యారెక్టర్ ని ఎంత వరకు వాడాలో అంత వరకే వాడారు ..చివరిలో మార్చాడు ...అదీ బాగుంటుంది ...

4.Fights and songs /Background music :
పవన్ కళ్యాణ్ కంపోజ్ చేసిన ఫైట్ లు రియల్ గా వుంటాయి .మూసలో సాగే  ఫైట్ లను బ్రేక్ చేసాడు పవన్ .ఇక మణిశర్మ అందించిన బాణీలు ..పాటలు ఇప్పటికీ బాగుంటాయి ..మంచి మ్యూజిక్ గొప్పదనం అది ...సీన్ లలో వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటుంది ...

5.Scene to scene magic :
ఫస్ట్ హాఫ్ లో పవన్ ,భూమిక పరిచయం దగ్గర నుండి --ఒకరి తర్వాత ఒకరు అపార్ధం చేసుకుంటూ ...వాళ్ళ ప్రేమ ను బయట పడనీయకుండా చూసుకుంటారు ..ఇంటర్వెల్ తర్వాత పవన్ కావాలని కొన్ని సార్లు ..భూమిక కావాలని కొన్ని సార్లు   వాళ్ళకి వాళ్ళు షాక్ లు ఇచ్చుకుంటూ వెళ్తారు ...ఎప్పుడయినా ఒక సీన్ రెండు సీన్ లతో ..లేదా మూడు సీన్ లతో కనెక్ట్ అయి వుంటుంది ..అందులో కుడా కాన్ఫ్లిక్ట్ వుంటుంది ..అది తీరిపోతే ఇంకొక కాన్ఫ్లిక్ట్ తో సీన్ లు వస్తుంటాయి ... కాన్ఫ్లిక్ట్ లన్నీ మెయిన్ కాన్ఫ్లిక్ట్ ,థ్రెడ్ ప్రకారం వుండాలి ....అలా పద్దతిగా అల్లినదే కధ ...

Attractive Episodes :
సెకండ్ హాఫ్ లో అలీ వచ్చిన తాగుడి ఎపిసోడ్ ...భూమిక ఫాదర్ -పవన్ ,భూమిక ఎపిసోడ్ సినిమా కి మంచి ఊపు నిచ్చాయి ...ఇవి ఎప్పుడు వచ్చినా టీవీ లో చూస్తూనే ఉంటాము ...

Second Captain of the cinema :
పి.సి .శ్రీరామ్ గారి కెమెరా కన్ను అద్భుతం గా ప్రతీ ఫ్రేమ్ లో వర్క్ చేసింది ...సినిమా కి అందం అక్కడే వస్తుంది ...డైరెక్టర్ తర్వాత డైరెక్టర్ అంతడి వాడు కాబట్టే కెమెరామెన్ కి విలువ ఇస్తారు ...విలువ వున్నా చోట అవుట్ పుట్ బాగా వస్తుంది ...మొన్న వచ్చిన "ఇష్క్  లోకూడా ఇది మీరు చూస్తారు ....

Creative clue :
సినిమా లు  నాలుగు రకాలు
1.పాయింట్ ని  ముందే చెప్పి సీన్ తో ఆడుకునే సినిమాలు ...ఖుషి ,బొమ్మరిల్లు ,3 ఇడియట్స్
2.పాయింట్ ని  ప్రీ క్లైమాక్స్ లో చెప్పే సినిమాలు ..చంద్రముఖి ,అపరిచితుడు ,కాంచన ,
3.పాయింట్ ని  స్లో గా చెప్పి ...కధలోకి వెళ్ళే సినిమాలు ..శివ ,మున్నాభాయి ఎం.బి .బి ఎస్ ... ఇడియట్ ...లగాన్ ...
4.క్యారెక్టర్ లతో నడిచే సినిమాలు ...
మన్మధుడు ,మిస్టర్ పర్ఫెక్ట్ ..దిల్ చాహతా హై...కిక్ ...
(ఇంకా నాకు పూర్తిగా తెలియదు ..శోధిస్తున్నా )

0 comments:

Post a Comment