Artical -14


మన తెలుగు సినిమా లు ఎక్కువ ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి ?
దక్షిణాది రాష్ట్రాలలో  ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్న ఫిలిం ఇండస్ట్రీ గా మన  ఆంధ్రప్రదేశ్ కి పేరుంది .ఇక్కడ వన్ ఇయర్ లో 120 --150 సినిమాలు రిలీజ్ అవుతాయి .మరి ఎందుకు వాటిలో 90-100 వరకు ఫ్లాప్ అవుతున్నాయి ?..వాటి సంగతి చూద్దాము..కారణాలు వెతుకుదాము ...

Reasons for Failures :

1.story line :
మంచి కధ + అనేక కల్పనలు + ఇప్పటి వరకు చూడని సీన్ లు =సినిమా పాస్ అవుతుంది ...
సదా సీదా కధ + కొత్త సీన్ లు + కొత్త హంగులు + గ్రాఫిక్స్ = సినిమా పాస్ కావొచ్చు (కానీ గ్యారంటీ చెప్పలేము ...)
పాత ,తెల్సిన కధ + చెత్త సీన్ లు +చెత్త ముఖాలు ,నటన + విజన్ లేని దర్శకుడు = సినిమా ఫెయిల్
అంటే బేసిక్ గా స్టొరీ లైన్ తీసుకోవడం లోనే కొత్తదనం లేదు ..అక్కడే సగం ఫెయిల్యూర్  అవుతున్నారు చాల మంది దర్శకులు ...అనుభవం లేని వారిని పక్కన పెడదాము ..,చివరకు అనుభవం వున్న వారు కుడా ఫెయిల్ అవుతున్నారు ...సో  బేసిక్ స్టొరీ లైన్ కొత్తగా వుండాలి ..అది వుంటే కొత్త సీన్ లు ..కొత్త క్యారెక్టర్ లు పుడతాయి ..సినిమా అంతా కొత్తగా వుంటుంది ..
మంచి కధ ను ఎంపిక చేసుకునే ఓపిక లేకుండా సినిమా నిర్మాణం చేపట్టడం ...
సినిమా కధ లో ప్రేక్షకుడిని ఆకట్టుకునే పాయింట్ లేక పోవడం ...లేదా స్క్రీన్ ప్లే లేకపోవడం ..
కధలన్నీ ప్రేమ కధ లే కావడం ...కధలో ప్రేమ వుండాలి గాని ..ప్రేమ కధే కధ కాకూడదు ...అది అందరూ చేస్తున్న తప్పు ...
కొత్త కోణం ,కొత్త మాటలు ,కొత్త స్క్రీన్ ప్లే ,కొత్త కధ ..ఇలా ఎవరూ ఆలోచించడం లేదు ....

2.Characterization :

ఒక పద్ధతి ప్రకారం కధ ను అభివృద్ధి చేయకపోవడం పెద్ద డ్రా బ్యాక్ ..దాని వలన పాత్రలను ప్రేక్షకులకు చేరువ చేయలేకపోవడం జరుగుతున్నది  ..సీన్ లు తార్కికం గా ,అర్ధవంతం గా సృజించ లేకపోవడం  కుడా స్క్రిప్ట్ లోపమే  ...ఇవన్నీ కారణాలే ...
సినిమా లో పాత్రా సరిగా ఎలివేట్ కాదు ...
బాయ్ ఫ్రెండ్ ఉండకపోతే  అమ్మాయిలు కారు అని ..లేచిపోవడాల తో యూత్ వుందని చూపించడం ..
యూత్ అంటే ఎప్పుడూ మందు కొడుతూ  వుంటారు అనే భావన లో హీరో ,ఫ్రెండ్స్ క్యారెక్టర్ లు వుండటం ...
చూపుతున్న ప్రేమలో బలం లేక పోవడం ...ప్రేమ ప్రేమ లా కాకుండా సెక్స్ లాగ వుండటం ...
హీరో క్యారెక్టర్ సరిగ్గా ఉండకపోవడం ...హీరో కి లక్ష్యం లేకుండా ,పోకిరి లా ప్రవర్తించడం ...అలా వున్నా చివర వరకు మారకపోవడం ...మారడానికి ఇన్సిడెంట్స్ సృస్టించ లేకపోవడం ....
బుతుమాటలు ..బూతు సన్నివేశాలు ఎక్కువ గా వుండడం ...
యువత ఉన్నతం ఆలోచిస్తారని ...గొప్ప లక్ష్యాలు ఉంటాయని ఆలోచించే కధలు ఏవి ? 3 ఇడియట్స్ లో ..రంగ్ దే బసంతి ..హ్యాపీ డేస్ ..ఐతే ..యువత ...ఇలాంటి సినిమాల్లో యువత బాగుంది కాబట్టే వాటిని ఆదరించారు ...
క్యారెక్టర్ లు ఎందుకు వస్తాయో తెలియదు ..ఎక్కడ ఎండ్ అవుతాయో తెలియదు ..కధ కు ఉపయోగపడతాయో తెలియదు ..  క్యారెక్టర్ కి   Individuality  ఇది వుండదు ...

3.Scenes:

సినిమా కు సీన్ లు కీలకం .. సీన్ లో ఎలా పండాలో..ఎలా ప్రేక్షకుడు ఫీల్ అవ్వాలో ...ఎలా వుంటే ప్రేక్షకుడు ఫీల్ అవుతాడో బాగా తెలిసి వుండాలి ...ఇక్కడ స్క్రిప్ట్ + కెమెరామెన్ +డైరెక్టర్  అతను నటులతో నటింప చేసే విధానం అన్నీ ప్లే చేస్తాయి ...ముందు స్క్రిప్ట్ లో సీన్ లే సరిగ్గా వుండవు ..ఇంక తీయడం ఎంత బాగున్నా ఏమి చేస్తాము ?...
సీన్ లు చాలా కొత్తగా ..సినిమా లైన్ కి తగిన విధం గా వుండాలి ...భావాతీతం గా ..అర్ధవంతం గా ..లాజిక్ గా ..తర్కం గా ..వేదాతం గా ...సస్పెన్సు గా ..త్రిల్ గా ..వుంటూ కధ ను ముందు కు నడపాలి ...సీన్ నుండి సీన్ కి లింక్ ఒక నదీ ప్రవాహం లా వెళ్లిపోవాలి ...నెక్స్ట్ ఏమిటి అన్నపాయింట్ కనపడాలి ...ప్రతీ సీన్ లోను కాన్ఫ్లిక్ట్ వుంటుంది ..దాన్ని చేజ్ చేయడం హీరో/హీరోయిన్ పని ...అది అయ్యాక నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్ ..ఇలా సీన్ లు అన్నీ జరగాలి ... సీన్ లు అన్నీ స్టొరీ బేస్ మీదే ఆధారపడి జరగాలి ...ఇలా ఒకప్పుడు డైరెక్టర్ లయిన పాత తరం డైరెక్టర్ లు ..కొనడు కొత్తతరం డైరెక్టర్ లలో కనపడుతున్నాయి ...వాళ్ళే సక్సస్ అవుతున్నారు ..మిగిలిన వారి పరిస్తితి తెలియడం లేదు ...

4.Director :

సినిమా కి కెప్టెన్ ..చాల మంది పోస్ట్ కోసమే ట్రై చేస్తుంటారు ...లైట్ బాయ్ నుండి ఆక్టర్ వరకు అందరికళ్ళు డైరెక్టర్ మీదే వుంటాయి ...తప్పులేదు .. పోస్ట్ అటువంటిది ..కానీ కొంత మంది కి అనుభవం వుంది అవుతారు ...కొంత మంది ఏమీ తెలియకుండా డైరెక్టర్ అయి నేర్చుకుంటారు ..ఎవరి దారి వాళ్ళది ..అనుభవం లేనప్పుడు చుట్టూరా అనుభవం వున్న వాళ్ళని పెట్టుకోవాలి ..అనుభవం వుంటే ప్రతీ విషయం లో ఇంకా జాగర్త గా వుండాలి ...డైరెక్టర్ అవ్వడం  మీ పర్సనల్ ..మీరు అనుకున్న సినిమా ఎలాగయినా తీయాలి అనే సంకల్పం ..దాన్ని చాలా మంది దుర్వినియోగం చేసుకుంటున్నారు ...అదే బాధ ...
మనీ కోసం ఫీల్డ్ కి వచ్చే వారు ఎంతో కాలం వుండరు ..ప్యాషన్ కోసం వచ్చే వాళ్ళు ఉంటారన్న నమ్మకం లేదు ...కేవలం తెలివితేటలు రాజ్యం ఏలుతాయి...ఇండస్ట్రీ లో నిలబడే తెలివితేటలు చాలా ముఖ్యం ..మీ స్క్రిప్ట్ లో తెలివితేటలు చూపండి ..మిమ్మల్ని ఎవరూ ఆపలేరు ...మనుషుల మీద చూపెడుతూ వుంటే ,మిమ్మల్ని ఇండస్ట్రీ దూరం పెడుతుంది ...
డైరెక్టర్ అవ్వాలని అనుకుంటే అదే అవ్వండి ..అన్నీ నేనే అనుకుంటే మీరు ఏమాత్రం ముందుకు వెళ్ళలేరు ...
కాబట్టి సీన్ ని ఎలా ఎలివేట్ చేయాలి ..ఎలా ఫ్రేమ్ కావలి ? అని కెమెరా మెన్ తో చర్చించండి ..డైరెక్టర్ టీం తో కుడా చర్చలు జరపండి ..సినిమా టీం వర్క్ ..అది లేక పోతే సినిమా రాదు ...ఆడదు...

5.Songs :

స్క్రిప్ట్ బాగున్నా పాటలు సరిఅయిన సందర్భం లేకుండా వస్తాయి ..దీని వలన సినిమా ప్రభావం తగ్గుతుంది ...సందర్భం లేకుండా పాత వస్తే అవి స్పీడ్ బ్రేకర్స్ లా అవుతాయి ...స్క్రిప్ట్ లో పాటలు ఒదిగిపొవాలి...
పాటలు రెండు రకాలు 1.మనసుని తాకేవి 2.శరీరాన్ని వూపేవి ...
పాత సినిమా లో అంతర్బాఘం కావాలి ..పాత ఎక్కడ ఉండాలో స్క్రిప్ట్ నిర్ణయించాలి ..కానీ " ఇక్కడ పాటేడ్డాము"అనుకుతూ పాత పెట్టడం వలన "పాటలు " మనసుని తాకడం లేదు ..

ఇవన్నీ  విమర్శలు అనిపిస్తే  చేసేదేమీ లేదు ...ఆత్మ విమర్శా గా తీసుకుంటే అందరికీ లాభం ...ముఖ్యం గా మీకు ,ఇండస్ట్రీ కి ,చూసే ప్రేక్షకులకి ....అల్ ది బెస్ట్ ..


0 comments:

Post a Comment