Ahana Pellanta



Ahana Pellanta :
మనకు బాధలు ఎక్కువయినప్పుడు ..బతుకుమీద చిరాకు కలిగినప్పుడు ..నవ్వు కునే చాన్సు లేనప్పుడు  మనం చేయాల్సింది ఒక్కటే ..జంధ్యాల సినిమా చూడటం ...ఒక రెండు గంటలు మనది కాదు ,అనుకుని సినిమా చూసామా అంతే చాలా రోజుల పాటు నవ్వుకునే టానిక్ ని మెదడు లోకి పంపిస్తాడు డాక్టర్ జంధ్యాల ...అటువంటి డైరెక్టర్ తీసిన మాస్టర్ పీస్ "అహనా పెళ్ళంట " గురించి ఆలోచిద్దాము
Script points :
కధ ,కధనం ,క్యారెక్టర్ ప్రవర్తన  క్లైమాక్స్ ఇలా స్క్రిప్ట్ లో ప్రతీ అంశం కి సంభందించిన వాటికీ బేస్ పాయింట్స్ అన్నీ ఫస్ట్ హాఫ్ లో వుండాలి ...లేదా ఉండేలా చూసుకోవాలి ...ఫస్ట్ హాఫ్ మీద ఏర్పడిన పునాదుల మీద సెకండ్ హాఫ్ నిర్మించ బడుతుంది ..అప్పుడే సినిమా కధ బాలన్స్అవుతుంది ...(ఇది వైస్ వార్సా )
1.Conflict point :
కధలో రెండు కాన్ఫ్లిక్ట్ లున్నాయి ...ఒకటి తండ్రి -కొడుకికి మధ్య వుంది ...
రెండవది రాజేంద్రప్రసాద్ కి కోటా కి మధ్య వుంది ..ఒకటి ఫస్ట్ హాఫ్ రన్ కు ..రెండవది సెకండ్ హాఫ్ రన్ కి ఉపయోగ పడుతుంది ...
తండ్రి -కొడుకుల మధ్య పోటా పోటీ గా వుండే గా వుండే యుద్ధం ...వీళ్ళిద్దరి మధ్య జరిగే కాన్ఫ్లిక్ట్ పాయింట్ సినిమా కి ఆధారం ...తండ్రి  నూతన్ ప్రసాద్ --అరేంజ్డ్ మారేజ్ చెయ్యాలని చూస్తాడు ..దానికి రీజన్ వుంటుంది (--అది అతని ప్రేమ కధ )
అయితే నూతన తరం అయిన రాజేంద్ర ప్రసాద్ లవ్ మారేజ్ చేసుకోవాలని ..రజని ని ప్రేమిస్తాడు ...తండ్రి కి తెలిసాక ఇద్దరి మధ్య --ఒప్పందం లాంటి సవాల్ వుంటుంది ....అదే మిగిలిన సినిమా ...
ఇక్కడ స్టార్టింగ్ లో తండ్రి కొడుకుల మధ్య వున్న రిలేషన్ ని బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు ..ఎందుకంటే బేస్ మీదే కాన్ఫ్లిక్ట్ వుంటుంది కాబట్టి ....
2.Character Base :
కోటా శ్రీనివాసరావు పాత్ర  పిసినారి పాత్ర ...ఎటువంటి విషయం లో అయినా అలాగే ఉంటాడు ... క్యారెక్టర్ మీద వేసుకున్న  బేస్ వలన రాజేంద్ర ప్రసాద్ --వాళ్ళింటికి వెళ్లి ఎంత కామెడీ చేసినా చెల్లుబాటు అవుతుంది ... బేస్ లేకపోతే ప్రతీ సీన్ లో రాజేంద్ర ప్రసాద్ చెప్పేవి --నేనెందుకు వినాలయ్యా ? అని కోటా ని అనేలా చేయలేవు ..ఎందుకంటే కోటా కి --"డబ్బు దాయటం" అతని వీక్ నెస్ ... వీక్ నెస్ ఎంత బాగా ఎస్టాబ్లిష్ చేస్తే ..అంత బాగా హీరో ఆడుకోవచ్చు ...అందుకే క్యారెక్టర్ వేసే టప్పుడు దాని బేస్ గురించి ఆలోచిస్తే ...కధలో కామెడీ రప్పించవచ్చు...
3.Different Characters :
నూతన్ ప్రసాద్ --ఎవడయినా దొరికితే "నా ఆటోబయోగ్రఫీ చెబుతాను " అని చంపేస్తుంటాడు
రాళ్ల పల్లి ---"అయ్యగారి సాల్ట్ కి ..సాంబార్ కి అన్యాయం చేయలేను " అని నమ్మిన బంటు క్యారెక్టర్
రాజేంద్ర ప్రసాద్ --కామెడీ ప్రేమికుడు
కోటా --పిసినారి పాత్ర
బ్రహ్మానందం --తిట్టుకునే పని వాడి పాత్ర
సుత్తివేలు వీరబద్ర రావు --మంచి గా వుండే వాడు , కోటా దెబ్బకు పిచ్చ్చిక్కే పాత్ర
పెళ్ళిచూపుల బృందం --సుభాలేక సుధాకర్ + ఇద్దరు అన్నలు
చివరి లో కోటా కి చెవిలో మాటలు చెప్పే వాడి పాత్ర
గుండు హనుమంత రావు  చెవిటి పాత్ర .....ఇవన్నీ కామెడీ పాత్రలే ...సన్నివేశాలకు అనుగుణం గా పాత్రలను ప్రవేశ పెట్టి ..వాటి తో కామెడీ రప్పించడం ..జంధ్యాల మార్క్ ...ప్రతీ క్యారెక్టర్ ఎంతో కొంత కామెడీ ప్లే చేస్తుంది ...
4.Different Scenes  with Dialogues :
నూతన్ ప్రసాద్ చూసే కొన్ని పెళ్లి చూపులు
రాజేంద్ర ప్రసాద్ హోటల్ లో ఇచ్చే ఆర్డర్ ...
తండ్రి చూడాలని రేడియో పాటలు ,యాడ్స్ తో సాంగ్ ..
కోటా దగ్గరకు రాజేంద్ర ప్రసాద్  వెళ్ళాక సీన్ లు ..
కోటా --వీర బద్ర రావు మధ్య సీన్ లు
రజని ని చూడటానికి వచ్చే పెళ్లి చూపుల వాళ్ళ తిండి గోల ..
క్లైమాక్స్ లో హడావుడి గోల .....ఇలా అన్నీ బాగానే నవ్విస్తాయి ...కొత్తగా వుంటాయి

About Jandhyala garu :
జంధ్యాల గారి ప్లస్ పాయింట్స్
కధ చాలా థిన్ లైన్ తీసుకోవడం ..
కధనం మీద ,క్యారెక్టర్ మీద ఎక్కువగా దృష్టి పెట్టడం ...
సీన్ లో క్యారెక్టర్ లు వుండాలి ..వుంటే బాగుంటుంది ..అసలు ఉండాలా ? లేదా ?...అనేవి బాగా ఆలోచిస్తారు ..
ఒక సీన్ లో ఒక క్యారెక్టర్ ఒక పాయింట్ అఫ్ వ్యూ తో మాట్లాడితే ..ఇంకోక క్యారెక్టర్ వేరొక పాయింట్ అఫ్ వ్యూ తో మాట్లాడి ..కామెడీ రప్పించడం (ఇదే త్రివిక్రమ్ ఫాలో అయ్యేది )
మారిన కాలం లో మారని మనుషులను క్యారెక్టర్ లు గా చూపి ...వాళ్ళ మాటల చేత ,పనుల చేత ..పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టడం ద్వార కామెడీ  రప్పించడం ..
"ఇలా అయితే మీ పరిస్థితి " అని ఒక్కసారిగా ఫ్యూచర్ లోకి వెళ్లి రావడం ..
పలానా క్యారెక్టర్ ఎందుకు అలా ప్రవర్తిస్తుందో --రీజన్ ..లాజిక్ చెప్పడం ..
కేవలం ఎక్స్ప్రెషన్ తో కామెడీ రప్పించడం ....
ఇవన్నీ ఆయనకున్న బలాలు ..ఆయన మనకు ఇచ్చిన ఆయుధాలు ....
ఇక ఆయన షాట్ డివిజన్ చాలా బాగుంటుంది ..కొన్ని ఫ్రేమ్ లు కుడా నవ్వు తెప్పిస్తాయి ...పాటల్లో రిథమ్ కట్ లు చాలా బాగుంటాయి ...ఎంత మేధావి ఈయన అని అనిపించక మానదు ...గ్రేట్ రైటర్ అండ్ డైరెక్టర్ ...
ఒక్క మాటలో చెప్పాలంటే --"కొన్ని వింత క్యారెక్టర్ మధ్య ..కొన్ని మామూలు క్యారెక్టర్ లతో కడుపుబ్బా నవ్వించే సినిమా --జంధ్యాల సినిమా "....
కామెడీ ఎలా వస్తుంది ? అది చూద్దాము
1.క్యారెక్టర్ కి వుండే వీక్ నెస్ మీద వేరొకరు ఆడుకున్నప్పుడు ...లేదా  వేరొకరు ఇబ్బందిపడినప్పుడు..
దూకుడు లో కామెడీ ....సుత్తివేల వీరబద్దర రావు చేసే కామెడీ ....
2.పరిస్థితి అలా కామెడీ గా మారడం ..లేదా సీరియస్ టైం లో కామెడీ క్యారెక్టర్ వెళ్ళడం ..హనుమాన్ జంక్షన్ లో ఆవు సీన్ ...చంటబ్బాయి లో కొన్ని సీన్ లు
3.తీసుకున్న బేస్ పాయింట్ మీద కామెడీ రావొచ్చు ..
హలో బ్రదర్ లో ఇద్దరు నాగార్జున మధ్య నడిచే కామెడీ ..
4.తప్పులు చేస్తుంటే కామెడీ రావడం ....
ఆవిడా మా ఆవిడే ...పెళ్ళాం ఊరెళితే... లో నడిచే కామెడీ ..
ఇలా చాలా రకాలుగా కామెడీ వస్తుంది ...అవి అన్వేషించాలి ..
5.Creative Clue :

డి డి ఎల్  సినిమా ని చూస్తే ---ఇప్పటికీ అనిపిస్తుంది ..ఇది ఏమన్నా "అహనా పెళ్ళంట " నుండి తీసుకున్నారా అని ...ఎందుకంటే "హీరో --హీరోయిన్ ఇంటికి వెళ్లి --వాళ్ళని మార్చడం "అనే ఫార్ములా ఇక్కడి నుండే మొదలు అయ్యింది కాబట్టి ....ఒక మాస్టర్ పీస్ నుండి ఇంకొక మాస్టర్ పీస్ వస్తుంది ..జాగర్త గా ఆలోచిస్తే ....అల్ ది బెస్ట్ ...

0 comments:

Post a Comment